JC Prabhakar Reddy: వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తలను గాలికొదిలేశారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గడపగడపకు కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు తప్ప.. ఒక్క కార్యకర్త కూడా ఎమ్మెల్యేల వెంటలేరని ఆయన ఆరోపించారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తల కంటే వాలంటీర్లే వైకాపా ఎమ్మెల్యేలకు ఎక్కువయ్యారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించిన వారంతా కార్యకర్తలను పట్టించుకోవటం లేదన్నారు. చంద్రబాబు త్యాగాలు చేయాలని ఓవైపు చెబుతున్నప్పటికీ.. తమ నాయకులు సిద్ధం కాలేదన్నారు. తెదేపా కార్యకర్తలను జైళ్లకు పంపుతుంటే కూడా తమ పార్టీ నాయకులు కనీసం స్పందించటం లేదని అందుకే తమ పార్టీ మాదిరిగానే వైకాపా కూడా తయారైందన్నారు. వైకాపా... కార్యకర్తలకు దూరమైనా.. వాలంటీర్లను తయారు చేసుకున్నారని, తెదేపాకు అలాంటి పరిస్థితిలేదన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయగలమని జేసీ ప్రభాకర్‌రెడ్డి హితవు పలికారు.
'వైకాపా ఎమ్మెల్యేలతో వాలంటీర్లు తప్ప కార్యకర్తలెవరూ లేరు' - పార్టీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం
JC Prabhakar Reddy: తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించిన వారంతా.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తెదేపా నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయగలమని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. వైకాపా కార్యకర్తలకు దూరమైనా.. వాలంటీర్లను తయారు చేసుకున్నారని.. తెదేపాకు అలాంటి పరిస్థితి లేదన్నారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి