ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు వైద్య పరీక్షల కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

jc prabhakar reddy asmit reddy in hospital for medical checkup
వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి

By

Published : Jun 13, 2020, 3:51 PM IST

సుప్రీం కోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారన్న ఆరోపణలతో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్​లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​కు తీసుకొచ్చారు.

అక్కడ విచారణ తర్వాత భారీ భద్రత నడుమ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి వచ్చిన సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో నో ప్రాబ్లం అంటూ వ్యాఖ్యానించడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details