జేసీ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయి కడప జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలను అనంతపురం కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండ్రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. వారి న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కడప నుంచి వారిని అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకురానున్నారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని పోలీసు కస్టడీకి అనుమతించిన కోర్టు
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో కడప జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌రెడ్డిని పోలీసు కస్టడీకి అనంతపురం కోర్టు అనుమతించింది. వారి న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని పోలీసు కస్టడీకి అనుమతించిన కోర్టు
బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు.
ఇదీ చూడండి:రెండు ట్రక్కుల ఎరువులు ఎత్తుకెళ్లిన రైతులు
Last Updated : Jun 19, 2020, 10:55 PM IST