ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు - బీఎస్​ 4 వెహికల్స్ న్యూస్

jc prabhakar arrest
jc prabhakar arrest

By

Published : Jun 13, 2020, 6:53 AM IST

Updated : Jun 13, 2020, 12:45 PM IST

06:51 June 13

తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడి అస్మిత్ రెడ్డిని కూడా శంషాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ హైదరాబాద్ నుంచి అనంతపురం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. వీరు బీఎస్ -3 వాహనాలను బీఎస్ -4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేశారని ఆర్టీఏ అధికారులు ఆరోపిస్తున్నారు.నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారని ….154 లారీలకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని.... కొంతకాలంగా ఆర్టీఏ అధికారులు ఆరోపించారు. జేసీ కుటుంబసభ్యులపై అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 12 కేసులు నమోదయ్యాయి. తాడిపత్రిలో 17.... కర్నూలు జిల్లాలో 3 కేసులు ఉన్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్‌ ఆరోపణలతో అనంతపురంలో 51 లారీలను గతంలో పోలీసులు సీజ్‌ చేశారు.

ఇదీ చదవండి: 'ప్రయాణం వల్లే అచ్చెన్నకు గాయం పెరిగింది'

Last Updated : Jun 13, 2020, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details