ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కుట్ర పూరితంగానే జేసీ కుటుంబీకుల అరెస్ట్' - జేసీ పవన్ కుమార్ రెడ్డి తాజా వార్తలు

ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జేసీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయిస్తోందని.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అన్నారు. తాము ఈ విషయంలో చట్టప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

jc  pawan kumar reddy criticises ycp government on prabhakar reddy arrest
జేసీ పవన్ కుమార్ రెడ్డి

By

Published : Jun 13, 2020, 3:13 PM IST

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ పూర్తిగా కక్ష సాధింపు చర్యేనని.. జేసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడిని అరెస్టు చేసి అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

విషయం తెలుసుకున్న పవన్ రెడ్డి స్టేషన్​కు వచ్చారు. కుట్రపూరితంగానే అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఎంత దూరం తీసుకెళ్తారో తామూ చూస్తామని.. చట్టప్రకారం ముందుకెళ్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details