ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హిందూ దేవాలయాలపై ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది' - ananthapuram district news

ఏపీలోని దేవాలయాల్లోని విగ్రహాలు ధ్వంసం అవుతున్నా...ప్రభుత్వం కేసులు నమోదు చేయకపోవటం దారుణమని అనంతపురం పార్లమెంట్ తెదేపా ఇన్​ఛార్జ్ జేసీ పవన్ కుమార్ రెడ్డి అన్నారు.

jc pawan
జేసీ పవన్ కుమార్ రెడ్డి

By

Published : Jan 2, 2021, 3:37 PM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం హిందూ దేవాలయాలపై ప్రేరేపిత దాడులకు పాల్పడుతోందని అనంతపురం పార్లమెంట్ తెదేపా ఇన్​ఛార్జ్ జేసీ పవన్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 125 దేవాలయాల్లోని విగ్రహాలు ధ్వంసం కాగా...ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం దారుణమన్నారు.

హిందుత్వ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని జేసీ మండిపడ్డారు. తెదేపా నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్న బాగోతాలు వెలుగు చూస్తున్నాయన్నారు. పార్టీలోకి చేరకపోతే అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయడం... పార్టీలో చేరితే వాటిని మాఫీ చేయడం చేస్తున్నారని వివరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వైకాపా ఒక మతాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడం సరికాదని హెచ్చరించారు. తక్షణమే ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయాలని.... అన్ని మతాలను సమానంగా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలని గుర్తు చేశారు. ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details