అనంతపురం జిల్లా కనేకల్లో రైతులు, రైస్ మిల్లర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు సమావేశమయ్యారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్, బొమ్మనహల్ మండలాల్లోని రైతులు.. తాము పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని, వర్షాలు కురిస్తే తడిసిపోతాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ బహిరంగ మార్కెట్లో వరి ధరలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.
రైతులతో సమావేశమైన సంయుక్త పాలనాధికారి - అనంతపురం జిల్లా సంయుక్త పాలనాథికారి వార్తలు
అనంతపురం జిల్లా కనేకల్లో అధికారులు,రైతులతో జిల్లా సంయుక్త పాలనాధికారి సమావేశమయ్యారు. మండలంలో రైతుల నుంచి అభ్యర్థనలను స్వీకరించారు. ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
రైతులతో సమావేశమైన అనంతపురం జిల్లా జేసీ