మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి పట్టణంలో జాయింట్ కలెక్టర్ పర్యటించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్ట్రాంగ్ రూములను ఆమె తనిఖీ చేశారు. ఆమెతో పాటు గుంతకల్లు, గుత్తి కమిషనర్లు విశ్వనాథ్, గంగిరెడ్డి ఆ గదులను పరిశీలించారు.
గుంతకల్లు, గుత్తిలో స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జేసీ - గుంతకల్లు మున్సిపల్ ఎన్నికలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి పట్టణంలోని పాఠశాలలోని స్ట్రాంగ్ రూములను జాయింట్ కలెక్టర్ సిరి తనిఖీ చేశారు.
గుత్తిలో జేసీ స్ట్రాంగ్ రూముల పరిశీలన
బ్యాలెట్ పత్రాల పంపిణీ, ఓట్ల లెక్కింపులు, సిబ్బంది నియామకం తదితర విషయాలను కమిషనర్లు.. ఆమెకు వివరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని ఆమె అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి.సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రివర్గ ఆమోదం