రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. ఐపీఎస్ అధికారి లాఠీ పైకెత్తి మహిళలను విచక్షణా రహితంగా కొట్టడం తన రాజకీయ జీవితంలో తొలిసారిగా చూస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనలో కీలకమైన సచివాలయాన్ని విశాఖకు తరలించే ఏకపక్ష నిర్ణయాన్ని సీఎం జగన్ విడిచిపెట్టాలని హితవు పలికారు. కర్నూలుకు హైకోర్టు రావడం వల్ల ఒరిగేదేమీలేదన్నారు. వైకాపాలోని చాలామంది ఎమ్మెల్యేలకూ అమరావతిలో రాజధాని కొనసాగాలని ఉందని జేసీ అన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది: జేసీ దివాకర్‌రెడ్డి - మూడు రాజధానులపై జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలు తాజా వార్తలు
ఏకపక్షంగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలుకు రాజధాని రావడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు.
![రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది: జేసీ దివాకర్‌రెడ్డి jc diwakar reddy respond on three capitals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5798185-224-5798185-1579684705854.jpg)
జేసీ దివాకర్‌రెడ్డి