విద్యుత్ బిల్లులపై సీఎం జగన్ ఇంటి ముందు భారీ స్థాయిలో ఆందోళన చేస్తే తప్ప స్పందించే పరిస్థితి ఉండదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైకాపా నేతలు తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తున్న విషయాన్ని ఆయన జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు దృష్టికి తీసుకెళ్లారు.
కోర్టు తీర్పులే లెక్క చేయడు.. ఇంట్లో దీక్షలు చేస్తే ఏం లాభం: జేసీ
కోర్టుల తీర్పులనే లెక్క చేయనప్పుడు.. తెదేపా నేతలు ఇళ్లలో ఉండి దీక్షలు చేస్తే సీఎం జగన్ ఎలా స్పందిస్తారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతిలో 158రోజులుగా దీక్షలు చేస్తుంటే ఒక్కరోజైనా స్పందించారా అని ప్రశ్నించారు.
jc diwakar reddy comments on jagan govt
ఎస్పీ బంగ్లాలో కలిసి తాడిపత్రి ప్రాంతంలో పరిస్థితిని వివరించారు. ఎస్పీ చాలా బాగా స్పందిస్తున్నారని.. కింది స్థాయి అధికారుల తీరు భిన్నంగా ఉందన్నారు. వైకాపా రాజ్యం నడుస్తోంది కాబట్టి... తెదేపా నేతలపై దాడులు జరగడం సహజమని కిందిస్థాయి అధికారులే చెబుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం జగన్ గట్టిగానే ఉన్నారని.. ఆయన దానిని సాధించే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి: రంగనాయకమ్మను విచారిస్తున్న సీఐడీ అధికారులు