అనంతపురం జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి అధికారులు చర్యలు చేపట్టారు. 36 గంటలపాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు.
ఇప్పటికే గుంతకల్లో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఇక్కడ 190 వరకు కరోనా కేసులు నమోదయ్యాయని, 12మంది ఇప్పటికే మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ నిబంధనలు పాటించాలన్నారు.