జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపిన కియా పరిశ్రమ - janatha curfew news in kia employees
ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఎర్రమంచిలోని కియా కార్ల పరిశ్రమ ఉద్యోగులకు సెలవు ప్రకటించి కర్ఫ్యూలో పాల్గొంది.
నిర్మానుష్యంగా మారిన కియా పారిశ్రామికవాడ
ప్రధాని మోదీ పిలుపుతో జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కియా కార్ల పరిశ్రమ కర్ఫ్యూలో పాల్గొని ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఫలితంగా పారిశ్రామికవాడ మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఆర్టీసీ, పలు ప్రైవేట్ వాహనదారులు కర్ఫ్యూలో పాల్గొనడం వల్ల 44వ నెంబరు జాతీయ రహదారి మొత్తం ఖాళీగా కనిపించింది.