అనంతపురం జిల్లాలో..
రాయదుర్గంలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా సాగింది. ఉదయం నుంచే ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు నడపకపోవటంతో రోడ్లన్నీ వెలవెలబోయాయి. కూరగాయలు, చికెన్, మటన్ మార్కెట్లతో సహా షాపులు, హోటళ్లు అన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. కరోనా మహమ్మారిని తరిమేసేందుకు ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. అర్బన్ ఎస్ఐ రాఘవేంద్రప్ప పోలీస్ సిబ్బందితో కలసి పట్టణంలో తిరుగుతూ పరిస్థితి సమీక్షించారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రజలు జనతా కర్ఫ్యూకి పూర్తి మద్దతు తెలిపారు.
నిర్మానుష్యంగా మారిన హిందూపురం ప్రధాన కూడళ్లు
కరోనా వైరస్ని తరిమికొట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హిందూపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో జనతా కర్ఫ్యూకి ప్రజలు సంఘీభావం తెలిపారు. నిత్యం జనసందోహంగా కనిపించే ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణంలోని వ్యాపార దుకాణాలన్ని స్వచ్ఛందంగా మూసివేశారు. మున్సిపల్ సిబ్బంది వాడవాడలా బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం మూసివేత