అనంతలో జనతా కర్ఫ్యూకి సంఘీభావం - Janatha curfew news in Anantapuram
అనంతపురం జిల్లాలో జనతా కర్ఫ్యూకి జిల్లా ప్రజలు సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకుండా ప్రధాని పిలుపును పాటిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో జనతా కర్ఫ్యూకి సంఘీభావం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా... ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దుకాణాలు, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రజలు ఎవరికి వారు ఇళ్లలోనే ఉండిపోయారు. అనంతపురం నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లోని రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. ఏ ప్రధాన కూడలి చూసినా జనం లేకుండా కనిపిస్తున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపును పాటిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో అప్రమత్తంగా ఉన్నామని ప్రజలంతా తమ సంఘీభావం ద్వారా తెలియజేశారు.