వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతపురంలో జనసేన పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు నిరసన చేప్టట్టారు. ద్వారంపూడి క్షమాపణ చెప్పాలని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. బొత్స పర్యటనను కూడా అడ్డుకుంటారన్న ఉద్దేశ్యంతో పోలీసులు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే జనసేన అధినేతపై ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
అనంతపురంలో జనసేన నేతల ఆందోళన - janasena chife pawan kalyan latest news update
అనంతపురంలో జనసేన పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ... అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.

అనంతపురంలో జనసేన నేతల ఆందోళన