Nagababu Met Janasena Party Activists: రాష్ట్రంలో సాగుతున్న నియంతృత్వ పాలన పోవాలంటే కొన్ని శక్తులు ఏకమవ్వాల్సి ఉందని జనసేన పార్టీ నేత నాగబాబు అన్నారు. అనంతపురంలో ఆయన వీర మహిళలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఎక్కువ శాతం వలసలు ఉన్నాయని, ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు బెదిరింపులతో.. రాజకీయ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. జనసేన కార్యకర్తలను బెదిరిస్తున్నారని అన్నారు. ఏ ఒక్క రైతుకూ న్యాయం చేయలేదన్నారు. ఇలాంటి నాయకులను విమర్శించడం కంటే.. ప్రజలే సరైన సమాధానం చెబుతారన్నారు.
నియంతృత్వ పాలన పోవాలంటే కొన్ని శక్తులు ఏకమవ్వాలి: నాగబాబు - janasena party latest info
Nagababu Met Janasena Party Activists: రాష్ట్రలో ప్రజాస్వామ్యం లేదని.. నియంతృత్వ పాలన సాగుతోందని జనసేన పార్టీ నేత నాగబాబు అన్నారు. దీనిని ఎదుర్కోవాలంటే కొన్ని శక్తులు ఏకమవ్వాల్సి ఉందని తెలిపారు. అనంతపురంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
జనసేన పార్టీ నేత నాగబాబు
"బెదిరింపులతో.. నియంతృత్వ ధోరణితో ప్రభుత్వం నడుస్తోంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా అన్ని శక్తులూ ఏకమవ్వాలి. ప్రతిపక్షాలపై కేసులు పెట్టి.. హింసిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు". - నాగబాబు, జనసేన నేత
ఇవీ చదవండి: