జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా.. కొత్త చెరువు రోడ్డు మరమ్మతులు శ్రమదానానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ జనసైనికుల సందడి మొదలైంది. కొత్తచెరువు ప్రధాన కూడలిలో పవన్ కల్యాణ్ సినిమా పాటలకు వారందరూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సభా ప్రాంగణం వద్ద పవన్‌కు స్వాగతం పలుకుతూ పెద్దఎత్తున ఫ్లెక్సీలను నాయకులు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
PAWAN TOUR: పవన్ పర్యటనతో జనసైనికుల సందడి - Anantapur district news
అనంతపురం జిల్లా కొత్తచెరువులో పవన్ కల్యాణ్ పర్యటించనుండడంతో కార్యకర్తలు, అభిమానుల సందడి ప్రారంభమైంది. పవన్ స్వాగతానికి భారీ స్థాయిలో ఫెక్సీలను ఏర్పాటు చేశారు.
PAWAN TOUR