అనంతపురం జిల్లాలోని గుంతకల్లు జనసేన శాసనసభ అభ్యర్థిగా మధుసూదన్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ తరుపున సీటు ఆశించినప్పటికీ...చివరికి స్థానిక ఎమ్మెల్యే జితేంద్రగౌడ్కు అధిష్టానం సీటు కేటాయించింది. నిరాశకు లోనైన మధుసూదన్ గుప్తా జనసేన పార్టీ సభ్యత్వం పొంది.. పెద్ద ఎత్తున జనసందోహంతో ర్యాలీగా వెళ్లి...నామపత్రాలు దాఖలు చేశారు. గుంతకల్లులో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని..దశాబ్దాల నుంచి అదే కొనసాగుతుందని ఆయన అన్నారు. తను ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని...పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.
'ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది' - అనంతపురంజిల్లా
గుంతకల్లు జనసేన శాసనసభ అభ్యర్థిగా కొట్రీకె.మధుసూదన్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు.
గుంతకల్లు జనసేన శాసనసభ అభ్యర్థిగా కొట్రీకె.మధుసూదన్ గుప్తా నామినేషన్