జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. అప్పట్లో ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సమయంలో అధికార పార్టీ బెదిరింపులకు దిగారని.. అందువల్ల కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని పార్టీ తరఫున కోరుతున్నట్లు చెప్పారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న జనసేన పార్టీ అభ్యర్థులపై దౌర్జన్యానికి దిగుతున్నారని.. ఇది అధికార పార్టీకి మంచిది కాదని అన్నారు. ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగే విధంగా ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.