వచ్చే నెల2న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని.. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో జనసేన నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కదిరి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఆరు మండలాల జనసేన నాయకులు, కార్యకర్తలు రక్తదాతల వివరాలను నియోజక వర్గ బాధ్యుడికి అందజేశారు.
కదిరిలో జనసేన నాయకుల రక్తదానం - పవన్ పుట్టినరోజు వేడుకల వార్తలు
సెప్టెంబర్ 2న జనసేన అధ్యక్షుడు పుట్టిన రోజును పురస్కరించుకొని...ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలలో రక్తదానం చేశారు.
![కదిరిలో జనసేన నాయకుల రక్తదానం janasena leaders Blood Donation Camp in kadiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8599526-14-8599526-1598673312629.jpg)
కదిరిలో జనసేన నాయకుల రక్తదానం శిబిరం
సెప్టెంబర్ 2న తమ అధ్యక్షుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. ఈ వేడుకలకు ముందు వారం రోజుల పాటు వివిధ రకాల సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా కదిరి ప్రాంతీయ వైద్యశాలలోని రక్త నిధి విభాగం సిబ్బంది సహకారంతో జనసేన నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.
ఇవీ చదవండి:యూజీ, పీజీ పరీక్షలకు సన్నద్ధం..!