ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

12న అనంతపురం జిల్లాకు పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల 12న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.లక్ష చెక్కులను అందజేయనున్నారు. అనంతరం "రైతు ముఖాముఖి" కార్యక్రమంలో పాల్గొంటారు.

Pawan Kalyan
Pawan Kalyan

By

Published : Apr 10, 2022, 7:33 PM IST

అనంతపురం జిల్లాలో ఈ నెల 12న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి.. పార్టీ తరఫున లక్ష రూపాయల చెక్కులను బాధితుల కుటుంబాలకు అందజేయనున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. 12న సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత.. రోడ్డు మార్గంలో కొత్త చెరువు చేరుకుంటారని మధుసూదన్ రెడ్డి తెలిపారు. అక్కడి నుంచి ధర్మవరం పట్టణంలోని శివనగర్, గొట్లూరు, బత్తలపల్లి మండలంలో పర్యటిస్తారని చెప్పారు. పరామర్శ అనంతరం రైతు ముఖాముఖి కార్యక్రమంలో అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని మధుసూదన్ రెడ్డి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details