ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆదరణ చూడలేకే కక్ష సాధింపు చర్యలు' - ఎన్నికల

ఎన్నికల నిబంధనల పేరుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన, సీపీఐ అభ్యర్థులు ఎన్నికల అధికారిపై మండిపడ్డారు. తమ ప్రచారాలకు అవకాశం లేకుండా కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

'ఆదరణ చూడలేకే కక్ష సాధింపు చర్యలు'

By

Published : Mar 31, 2019, 8:35 AM IST

'ఆదరణ చూడలేకే కక్ష సాధింపు చర్యలు'
ఎన్నికల నిబంధనల పేరుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన, సీపీఐ అభ్యర్థులు ఎన్నికల అధికారిపై మండిపడ్డారు. గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా తదితరులు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి గతంలో కుట్టు యంత్రాలు తమ నివాసంలో ఉంచామనీ... అవి ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేస్తారని వచ్చిన వార్తలతో.. రిటర్నింగ్ అధికారి, పోలీసులు తమ ఇంటిపై సోదాలు జరపడం అమానుషమని అన్నారు. తమ ప్రచారాలకు అవకాశం లేకుండా కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేస్తామన్నారు. నియోజకవర్గంలో జనసేనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇతర పార్టీలు తమపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నాయని అనంతపురం పార్లమెంట్ సీపీఐ అభ్యర్థి జగదీష్ దుయ్యబట్టారు.

ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details