ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అనంతపురం జిల్లావ్యాప్తంగా 95 లక్షల మెుక్కలు నాటుతున్నాం' - అనంతపురం జగనన్న పచ్చతోరణం న్యూస్

ఉద్యమ స్ఫూర్తితో మెుక్కలు నడిపే కార్యక్రమాన్ని చేపటడుతున్నట్లు అనంతపురం జిల్లా డీఎఫ్ఓ జగన్నాథ్​సింగ్ అన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 95 లక్షల మెుక్కలు నాటుతున్నట్లు వెల్లడించారు.

jananna pachathoranam scheme in anantapur
అనంతపురం జిల్లా డీఎఫ్ఓ జగన్నాథ్​సింగ్

By

Published : Jul 20, 2020, 6:38 PM IST

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 95 లక్షల మెుక్కలు నాటుతున్నట్లు డీఎఫ్​ఓ జగన్నాథ్​సింగ్ వెల్లడించారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా అటవీ, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేదల గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల సహకారంతో ఆయా సముదాయాల వద్ద పెద్ద ఎత్తున మెుక్కలు నాటే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వివరించారు. ఇప్పటికే 12 లక్షల మెుక్కలు పంపిణీ చేశామనీ, మరో వారం రోజుల్లో అన్ని ప్రాంతాలకు మెుక్కలను తరలిస్తామని జగన్నాథ్​సింగ్ అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో మెుక్కలు నాటిస్తున్నట్లు తెలిపారు. మెుక్కల కోసం రెండు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details