Pavan kalyan: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈనెల 21న తిరుపతిలో జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు వరుణ్ తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందన్నారు. గతంలోను రాష్ట్రవ్యాప్తంగా రాయలసీమ జిల్లాల్లోనూ తమ నాయకుడు పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా కృషి చేశామన్నారు.
ఈనెల 21న తిరుపతిలో జనసేన జనవాణి - tirupati
Janasena Party ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జనసేన పార్టీ తిరుపతిలో జనవాణి కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని అనంతపురం జనసేన పార్టీ అధ్యక్షుడు తెలిపారు.
జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం