కరోనా అంతం కోరుతూ వేదపండితుల జలదీక్ష ! - కరోనా అంతం కోరుతూ వేదపండితుల జలదీక్ష !
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో వేదపండితులు జలదీక్ష చేపట్టారు. కరోనా మహమ్మారి అంతం కావాలని కోరుతూ...సూర్య గ్రహణం సందర్భంగా సుమారు రెండు గంటల పాటు జలదీక్ష చేశారు.

కరోనా అంతం కోరుతూ వేదపండితుల జలదీక్ష !
కరోనా మహమ్మారి అంతం కావాలని కోరుతూ.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో వేదపండితులు జలదీక్ష చేపట్టారు. ప్రజలకు రోగనిరోధక శక్తి పెరగాలని గ్రహణం సందర్భంగా జలదీక్ష చేపట్టినట్లు పురోహితులు తెలిపారు. సుమారు రెండు గంటల పాటు నీటిలోనే ఉండి దీక్ష చేశారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు శ్రీనివాసాచార్యులు, పవన్ కుమార్ ,రంగనాథాచార్యులు పాల్గొన్నారు.