ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ - రాయదుర్గంలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ

అనంతపురం జిల్లాలో జగనన్న విద్యాకానుక పథకాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.

jagananna vidya kanuka kits distribution at ananthapuram
అనంతపురంలో జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ

By

Published : Oct 8, 2020, 7:25 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ఎంజీఎం పాఠశాల ఆవరణలో జగనన్న విద్యాకానుక పథకాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విద్యార్థులకు కానుకలు అందజేశారు.

అనంతపురంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. పేదల పిల్లలకు ఉన్నత చదువులు అందించాలనే సంకల్పంతో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.

రాయదుర్గం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో... జగనన్న విద్యా కానుక పథకం ద్వారా విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

కరోనా రెండోసారి తిరగబడుతోంది: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details