రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి గుత్తేదారులు పనులు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని తెదేపా పొలిట్బ్యూలో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నరేళ్ల క్రితం కాంట్రాక్టర్లు చేసిన పనులకు నేటికీ బిల్లులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తోందని దుయ్యబట్టారు.
రాయదుర్గం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు జయరాం రెడ్డి ఆదివారం రాయదుర్గం- కనేకల్ రహదారి విస్తరణ పనులు అడ్డుకోవటమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో గుత్తేదారులు బతికే పరిస్థితి లేదని కాల్వ వ్యాఖ్యానించారు.