ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gowtham Reddy: 'ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్​మెంట్ స్కూల్' - స్కిల్ డెవలెప్​మెంట్​పై మంత్రి గౌతంరెడ్డి నిర్ణయం

చదువు, నైపుణ్యాలు ఉంటేనే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని.. మంత్రి గౌతంరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొల్పిన తొలి బయోటెక్నాలజీ పరిశ్రమను.. జిల్లాలోని చిలమత్తూరు మండలం కోడూరు వద్ద గల ఇండస్ జీన్ ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్​ ను ఆయన ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కూల్ ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

minister gowtham reddy
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్​మెంట్ స్కూల్

By

Published : Jul 5, 2021, 8:40 PM IST

అనంతపురం జిల్లాను బయోటెక్ హబ్​గా మారుస్తామని.. చదువు, నైపుణ్యాలు ఉంటేనే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని.. మంత్రి గౌతంరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కూల్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నెలకొల్పిన తొలి బయోటెక్నాలజీ పరిశ్రమను.. జిల్లాలోని చిలమత్తూరు మండలం కోడూరు వద్ద గల ఇండస్ జీన్ ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్​ ను మంత్రి ప్రారంభించారు.

సాఫ్ట్​వేర్​ నుంచి కమ్యూనికేషన్ వరకు అంతా ఆంగ్లంలోనే ఉండటంతో.. ఆంగ్ల భాషను పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ.. పరిశ్రమలు లేకపోవడంతో ఉద్యోగావకాశాలు లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అనంతపురం జిల్లా బెంగళూరుకు సమీపంలో ఉండటంతో.. ఇండస్ట్రియల్​గా అభివృద్ధి చేయాలని సీఎం బలంగా నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details