ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓబుళాపురం గనుల కేసు విచారణ... ఈ నెల 10కి వాయిదా - ఓబుళాపురం గనుల కేసు విచారణ

ఓబుళాపురం గనుల కేసును విశాఖ సీబీఐ కోర్టుకు అప్పగించాలన్న సీబీఐ అభ్యర్థనపై...తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఈ మేరకు సీబీఐ కోర్టు విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది.

ఓబుళాపురం గనుల కేసు విచారణ... ఈ నెల 10 కి వాయిదా

By

Published : Oct 1, 2019, 9:03 PM IST

Updated : Oct 1, 2019, 11:59 PM IST

ఓబుళాపురం గనుల కేసు విచారణ... ఈ నెల 10 కి వాయిదా

ఓబుళాపురం గనుల కేసు అనంతపురం జిల్లా అంశమైనందున విశాఖ సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని సీబీఐ కోరింది. కేసును విశాఖకు బదిలీ చేస్తే తనకేమీ అభ్యంతరం లేదని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. తమకూ అభ్యంతరం లేదని నిందితులు బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్, రాజగోపాల్ చెప్పారు. కానీ తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ కృపానందం... ఈ కేసును విశాఖకు బదిలీ చేయవద్దని కోరారు. అభ్యంతరాలపై వాదనల కోసం సీబీఐ కోర్టు విచారణ ఈనెల 10కి వాయిదా వేసింది.

Last Updated : Oct 1, 2019, 11:59 PM IST

ABOUT THE AUTHOR

...view details