భూ వివాదం కారణంగా ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గాండ్లపెంటకు చెందిన రామిరెడ్డి, ఓబుళరెడ్డి కుటుంబాల మధ్య భూవివాదం ఉంది. రెవెన్యూ అధికారులతో కలిసి పొలం వద్ద కొలతలు వేసే సమయంలో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా పెద్దదై రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో రాజశేఖర్రెడ్డి, ఆయన భార్యకు గాయాలయ్యాయి. బాధితులను డీఎస్పీ షేక్ లాల్ మహమ్మద్ పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. గొడవకు కారణమైన ఇరు వర్గాలకు చెందిన 20మందిపై కేసు నమోదు చేసినట్లు గాండ్లపెంట ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.
పొలం విషయంలో వివాదం.. 20మందిపై కేసు నమోదు
అనంతపురం జిల్లా గాండ్లపెంటలో పొలం విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘర్షణకు కారణమైన 20మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
issue between two families abut land in annatapur dst