సుందరంగా ముస్తాబవుతోన్న ఇస్కాన్ మందిరాలు
సుందరంగా ముస్తాబవుతోన్న ఇస్కాన్ మందిరాలు - ఇస్కాన్
శ్రీకృష్ణాష్టమి వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్కాన్ మందిరాలు సుందరంగా ముస్తాబవుతున్నాయి. అనంతపురం, గుంటూరు జిల్లాలో విద్యుత్ కాంతులతో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.

iskcon-temples-ready-for-krishnastami
శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని అనంతపురంలోని ఇస్కాన్ మందిరాన్ని సుందరంగా అలంకరించారు.విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆలయం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.భారీ రథాన్ని గుర్రాలు లాగుతున్నట్లు తీర్చిదిద్దిన కళాఖండం ప్రత్యేకంగా నిలిచింది.ఆలయంలో రెండు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు జరగనున్నాయి.