అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో హంద్రినీవా కాలువ మీద జలాశయం నిర్మాణం కోసం జలవనరుల శాఖ ఈఈ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భూ పరిశీలన చేపట్టారు. గురువారం ఉదయం సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి, పందిపర్తి గ్రామాల పరిధిలో జలాశయ నిర్మాణం కోసం భూములను పరిశీలించారు. గుడిపల్లి సమీపంలోనే జలాశయం నిర్మించేందుకు అనుకూలం ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
రిజర్వాయర్ నిర్మాణానికి భూ పరిశీలన - irrigation department latest news
సోమందేపల్లి మండలంలో హంద్రినీవా కాలువ మీద జలాశయం నిర్మాణం కోసం జలవనరుల శాఖ అధికారులు భూ పరిశీలన చేపట్టారు. గుడిపల్లి సమీపంలోనే జలాశయం నిర్మించేందుకు అనుకూలం ఎక్కువగా ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. జలాశయం నిర్మిస్తే గుడిపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించాల్సి వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ప్రభుత్వం అన్ని విషయాలు ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెప్పారు.
జలాశయం నిర్మిస్తే గుడిపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించాల్సి వస్తుందని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని.. ప్రజలకు నష్టపరిహారం చెల్లిస్తారని అధికారులు వివరించారు. జలాశయం నిర్మిస్తే గుడిపల్లిలో 13వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం నీట మునుగుతుందని ప్రజలు అధికారులకు సూచించారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే జలాశయ నిర్మాణం జరుగుతుందని అధికారులు వివరించారు.
ఇదీ చదవండీ... రైతులకు విద్యుత్ బిల్లుల సమస్య ఉండదు: సీఎం జగన్