అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 62,500 రూపాయల నగదు, 21 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమందేపల్లి పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మహబూబ్ బాషా కేసు వివరాలను వెల్లడించారు.
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు - anantapur district latest news
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 22 మందిని అనంతపురం జిల్లా సోమందేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ipl cricket betting gang arrested
ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్నందున క్రికెట్ బెట్టింగ్‌లు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు. ఇందులో భాగంగానే 22 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న డీఎస్పీ... డబ్బుల కోసం యువత అడ్డదారి తొక్కవద్దని హెచ్చరించారు.