పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ గిరిబాబు తెలిపారు. అనంతపురం టూరిజంశాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. తిరుపతిలో భారత, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ కోర్సు నేటి విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉపయోగపడుతుందన్నారు. పదోతరగతి పాస్, ఇంటర్ ఫెయిల్, పాస్ అయిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తు ప్రణాళికలు చేసుకోవచ్చని సూచించారు.
హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం - Invitation to apply for Hotel Management courses
పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ గిరిబాబు తెలిపారు. అనంతపురం టూరిజంశాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల దరఖాస్తులకు ఆహ్వానం