అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి గ్రామ శివాలయంలో గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేశారు. గర్భగుడిలోని విగ్రహాల్లో విలువైన వస్తువులు ఉంటాయని భావించి, మెటల్ డిటెక్టర్లను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గుప్త నిధుల తవ్వకాల ముఠాను అరెస్టు చేశారు.
ARREST: గుప్త నిధుల తవ్వకాలు.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు - crime news in ananthapuram district
అంతర్రాష్ట్ర గుప్త నిధుల తవ్వకాల ముఠాను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వినాయకుడి విగ్రహం, దీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్, మూడు చరవాణులు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
అంతర్రాష్ట్ర గుప్త నిధుల తవ్వకాల ముఠా అరెస్టు
పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు ముఠా సభ్యుల్లో.. ముగ్గురు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద నుంచి ధ్వంసమైన వినాయకుడి విగ్రహం, దీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్, మూడు చరవాణులు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును త్వరగా ఛేదించేందుకు కృషి చేసిన సిబ్బందిని సీఐ శ్రీనివాసులు కొనియాడారు.
ఇదీచదవండి.
'జగన్ పాలనలో సొంత పార్టీ కార్యకర్తలకే రక్షణ లేకుండాపోయింది'
TAGGED:
కళ్యాణదుర్గం నేర వార్తలు