దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాల సభ్యులను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. పార్ధీ గ్యాంగ్, సత్తెనపల్లి గ్యాంగ్ లకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు.. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దోపిడీలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల్లో.. ఈ ముఠాలు పలు దోపిడీలకు పాల్పడ్డాయని తెలిపారు. పార్ధీ గ్యాంగుకు చెందిన డోల్‌సింగ్ అనే దొంగ నుంచి రూ.12 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి ముఠాకు చెందిన ఇద్దరి నుంచి 28 తులాల బంగారం, రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ముఠాలపై రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల్లోనూ అనేక దోపిడీ కేసులున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
పార్ధీగ్యాంగ్, సత్తెనపల్లి గ్యాంగ్ పేరుతో చోరీలు సాగించే.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.
అంతర్రాష్ట్ర చోరీ ముఠాల అరెస్ట్