Denial of pension to freedom fighter స్వాతంత్య్ర సమరయోధుడికి పింఛను మంజూరు చేయకపోవడంపై ‘ఈనాడు’లో వచ్చిన కథనంపై హైకోర్టు స్పందించింది. ఈ కథనాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుని మంగళవారం విచారణ జరిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరుతూ సెప్టెంబరు 26కు విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని ఈనెల 13న అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు మేళవాయి గోవిందరెడ్డిని జిల్లా యంత్రాంగం సన్మానించింది. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ పింఛను రావడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ‘స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నా పింఛను అందలేదు’ అనే శీర్షికన ఆగస్టు 14న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఇది చదివిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి కథనాన్ని జత చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ పంపారు. గోవిందరెడ్డికి పింఛను రాకపోవడాన్ని సుమోటో కేసుగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వివరాలను పరిశీలించిన సీజే ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.. స్వాతంత్య్ర సమరయోధులకు పింఛను పథకం వర్తించాలంటే 6 నెలల జైలు జీవితం గడపాల్సి ఉంటుందన్నారు. అధికారుల వివరాల ప్రకారం 1942లో గోవిందరెడ్డి మైనర్ అని, ఆ సమయంలో ఆయన్ని అరెస్టు చేసే అవకాశం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ప్రధానమంత్రికి లేఖ రాశారన్నారు. పూర్తి వివరాల సమర్పణకు సమయం కావాలన్నారు.
Pension to freedom fighter స్వాతంత్య్ర సమరయోధుడికి పింఛను నిరాకరణపై విచారణ - ఏపీ తాజా వార్తలు
Denial of pension to freedom fighter ఓ స్వాతంత్య్ర సమరయోధుడికి పింఛను మంజూరు చేయకపోవడంపై ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనంపై హైకోర్టు స్పందించింది. ఈ కథనాన్ని సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు దానిపై విచారణ జరిపింది. ఆ స్వాతంత్ర్య సమరయోధుడికి పింఛను మంజూరు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరింది. తదుపరి విచారణను సెప్టెంబరు 26కు వాయిదా వేసింది.

పింఛను నిరాకరణపై విచారణ