అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం చెవిటి వారి పల్లిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటన లక్ష్మీ నరసమ్మ అనే మహిళకు గాయాలయ్యాయి. పొలం పనులకు వెళ్లి వచ్చిన ఆమె వంట చేసే క్రమంలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించటంతో... లక్ష్మీ నరసమ్మ ముఖం, శరీరంపై గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం కదిరికి తరలించారు.
గ్యాస్ లీకై చెలరేగిన మంటలు.... మహిళకు తీవ్ర గాయాలు - అనంతపురం జిల్లా చెవిటివారి పల్లిలో గ్యాస్ లీకేజీ వార్తలు
గ్యాస్ సిలిండర్ లీకై చెలరేగిన మంటలకు మహిళకు గాయాలైన ఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం చెవిటివారిపల్లెలో జరిగింది.
వంట గ్యాస్లీకై మంటల్లో చిక్కుకున్న మహిళకు తీవ్ర గాయాలు