అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ తెదేపాలో చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భాజపాకు చెందిన కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్వీ నాగేంద్ర ప్రసాద్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తెదేపాలో చేరారు.
అనంతలో తెదేపాలోకి చేరికలు - కదిరి వార్తలు
అనంతపురం జిల్లాలో రోజురోజుకు తెదేపా బలపడుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీలోకి చేరికలు పెరిగిపోతున్నాయి. తాజగా భాజపా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.
అనంతలో తెదేపాలోకి పెరుగుతోన్న చేరికలు
వజ్రకరూర్ మండలం గడేహోతూరు సర్పంచి సురేంద్ర సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. సురేంద్ర పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 127 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అతనితో పాటు కొంతమంది సభ్యులు కూడా తెదేపాలో చేరారు.
ఇదీ చదవండిరాయదుర్గంలో తేదేపా ఇంటింటి ప్రచారం