అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని మహేష్, మల్లేష్ అనే రైతులకు చెందిన వ్యవసాయ పొలంలోని బోరులో నుంచి నీరు పైకి ఉబికి వస్తోంది. గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు భూగర్భజలాలు బాగా పెరగడంతో ఇలా వస్తుందని రైతులు తెలిపారు. బోరు బావి తవ్వించి చాలా సంవత్సరాలైనా ఎప్పుడూ నీరు ఇలా ఉబికి రాలేదన్నారు. మోటర్ వేయకుండానే నీళ్లు బాగా వస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు
భారీ వర్షాలకు పెరిగిన భూగర్భజలాలు - ananthapuram district
వారం రోజుల నుంచి రాయలసీమలో కురుస్తున్న భారీ వర్షాలకు భూగర్భ జలాలు బాగా పెరిగాయి. దీంతో బోర్లు మోటర్లు ఆన్ చేయకుండానే నీరు పైకి ఉబికి వస్తుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
భారీ వర్షాలకు పెరిగిన భూగర్భజలాలు