అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాలనుంచి భక్తులు తరలిరానున్నారు. స్వామివారి సేవలో భక్తులు పాల్గొననున్నారు. ఇదిలావుంటే బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నా ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. స్వాగత తోరణాలు ఇప్పటివరకు సిద్ధం కాలేదు. పది రోజుల కిందటే ముస్తాబు కావాల్సిన స్వామివారి బ్రహ్మరథం అలంకరణ చేపట్టలేదు. స్వామి భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే భృగు తీర్థం పునరుద్ధరణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. స్వామివారి తిరువీధుల్లో అపరిశుభ్రత, భక్తులకు తగినన్ని స్నానపు గదులు సిద్ధం కాలేదు. ఈ పరిస్థితిని చూస్తున్న స్థానికులు ఏర్పాట్లు పూర్తవుతాయా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమీపిస్తున్న బ్రహ్మోత్సవాలు..పూర్తికాని పనులు - కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడుతున్నా ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. అధికారుల తీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో త్వరగా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
సమీపిస్తున్న బ్రహ్మోత్సవాలు..పూర్తికాని పనులు