PENNA RIVER: ఎండాకాలం కావటంతో పెన్నా నదిలో జలాలు తగ్గి ఇసుక మేటలు తేలాయి. ఆ నదిలో రజకులు చిన్నచిన్న నీటి కుంటలు ఏర్పాటు చేసుకొన్నారు. అక్కడి దోబీఘాట్లలో దుస్తులు ఉతికి.. అక్కడే ఆరేస్తున్నారు. ఎడారిలా మెరిసిపోతున్న ఇసుకపై రంగురంగుల దుస్తుల తోరణాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణాన్ని ఆనుకుని ఉన్న పెన్నా తీరంలో ఈ చిత్రం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది. నీరు లేక చిన్నబోయిన నది తీరం దుస్తుల హారాలతో ఆకట్టుకుంటోంది కదూ!
PENNA RIVER: ఎడారిలా నది తీరం.. ఆకట్టుకుంటున్న దుస్తుల హారం - అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పెన్నా తీరం
PENNA RIVER: ఎండాకాలం కావడంతో ఆ నదిలో జలాలు తగ్గి ఇసుక మేటలు తేలాయి. అయితే అక్కడ ఉన్న రజకులు చిన్నచిన్న నీటి కుంటలు ఏర్పాటు చేసి, దుస్తులు శుభ్రంగా ఉతికి అక్కడే ఆరేస్తున్నారు. మరి కంటికి చూడముచ్చటగా ఉన్న ఆ చిత్రాన్ని మీరు చూసేయండి..
నీరు లేక చిన్నబోయిన నది తీరం.. దుస్తుల హారాలతో ఆకట్టుకున్న వేళ