అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం కృష్ణాపురం జీరో రోడ్డులో ఓ ఆవు... ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. రోడ్డుపై తిరిగే 12 మందిపై దాడికి పాల్పడింది. ఉదయం నుంచి కనిపించిన వారందరిపై కొమ్ములతో దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... తాడిపత్రి పట్టణానికి చెందిన మహిళ రామలక్ష్మమ్మ పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ, జంతు సంరక్షణ శాఖ, పోలీసు, అగ్నిమాపక శాఖ వారు ఆవును నిర్బంధించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఆవు సమీపంలోకి వెళ్లేందుకు అధికారులూ భయపడ్డారు.
ఆవు దాడిలో.. మహిళ ప్రాణం ఆవిరి - తాడిపత్రి పట్టణం
సాధు జంతువే. అయినా.. ఒక్కసారిగా క్రూర మృగంలా ప్రవర్తించింది. ఒకరి మరణానికి కారణమైంది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన... మరింతమందిని గాయాలపాలు చేసింది.

ఆవు చేతిలో ఆవిరైన ప్రాణం
Last Updated : Jul 31, 2019, 7:54 PM IST