ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాస్కు లేకుంటే భారీ మొత్తంలో జరిమానాలు

By

Published : Oct 29, 2020, 3:21 PM IST

గుంతకల్లులో మాస్కు లేకుండా బయటికి వచ్చి ప్రధాన కూడళ్లలో తిరిగే వారికి భారీ మొత్తంలో జరిమానా వేస్తున్నారు. ఒక్కొక్కరికి 100 రూపాయలు వరకు జరిమానా విధిస్తున్నారు. ప్రతి ఒక్కరు విధిగా దుకాణాలు, కల్యాణ మండపాలు, రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని మున్సిపల్ అధికారులు అన్నారు.

without a mask
మాస్కు లేకుంటే భారీ మొత్తంలో ఫైన్ లు

అనంతపురం జిల్లా గుంతకల్లులో మాస్కు లేకుండా బయటికి వచ్చి ప్రధాన కూడళ్లలో తిరిగే వారికి పెద్ద మెుత్తంలో ఫైన్ లు వేస్తున్నారు. రోడ్లపై మాస్కులు లేకుండా ద్విచక్ర వాహనాల్లో సంచరిస్తున్న...ఒక్కొక్కరికీ 100 రూపాయలు వరకు జరిమానా విధిస్తున్నారు. గత వారం రోజులుగా కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండటానికి వివిధ రూపాల్లో ప్రసార మాధ్యమాల ద్వారా మున్సిపల్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయినా ప్రజలు పట్టించుకోకపోవడంపై చర్యలు చేపట్టామరు.

జరిమానా విధించిన వారికి కొత్త మాస్కు ఇచ్చి కొవిడ్ నిబంధనలు తెలియచేస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు విధిగా దుకాణాలు, కల్యాణ మండపాలు, రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని మున్సిపల్ అధికారులు అన్నారు. లేని పక్షంలో కఠినంగా జరిమానా విధిస్తామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details