Sanskrit instead of Telugu In Tenth Exam : విద్యార్థి భవిష్యత్తుకు పునాది పదవ తరగతి. 10 వ తరగతి ఉత్తీర్ణత కావాలని విద్యార్థులు కష్టపడతారు. ఆ విద్యార్థి సంవత్సరం చదివిన చదువును పరీక్షల్లో అమలు చెద్దామని పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. ఇన్విజిలేటర్ ఇచ్చిన ప్రశ్నాప్రత్రం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను షాక్ అయ్యింది తాను చదివిన ప్రశ్నలు రానందుకు కాదు తన సబ్జెక్ట్ పేపర్‌కు బదులుగా వేరే సబ్జెక్ట్ పేపర్ ఇచ్చారు ఆ విద్యార్ధికి..
తెలుగు బదులు సంస్కృతం :తనకు తెలుగు ప్రశ్నాపత్రంకు బదులు సంస్కృతం భాషకు చెందిన ప్రశ్నాపత్రం రావడంతో ఆ విద్యార్థి అయోమయంలో పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి అజిత్ కుమార్ అనంతపురం జిల్లా పరీక్షా కేంద్రంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అజిత్ కుమార్ కుందుర్పి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పదవ తరగతి తెలుగు పరీక్షకు హాజరు అయ్యాడు. పరీక్ష రాయడానికి అక్కడికి వెళితే తనకు సంస్కృతి ప్రశ్నాపత్రం అందడంతో కంగుతిన్నాడు.
పరీక్ష గదిలోని ఇన్విజిలేటర్‌ని అడుగగా ఆ విద్యార్థికి సంస్కృతి ప్రశ్నాపత్రమే తనకు వచ్చిందని ఆ ఇన్విజిలేటర్ తెలిపాడు. ఈ విషయంపై సంబంధిత ప్రధానోపాధ్యాయులు అడిగి విచారించగా విద్యార్థి దరఖాస్తు చేసుకునే సమయంలో అలాగే రాసి పంపారని నిర్ధారించారు. విషయం బయటకు పొక్కకుండా విద్యార్థికి నచ్చజెప్పి, ఏ ప్రశ్నాపత్రం వచ్చినదో అదే ప్రశ్న పత్రానికి జవాబు రాయమని తెలిపి విద్యార్ధిని పంపేశారు.