ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దురుసు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని ఐఎంఏ సభ్యుల నిరసన - hindupuram doctors protest news

అనంతపురం జిల్లా హిందూపురంలో మెడికల్​ అసోసియేషన్​ సభ్యులు ఆందోళన చేపట్టారు. తాడిపత్రిలో వైద్యుల పట్ల ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించడాన్ని వారు ఖండించారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

దురుసు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని ఐఎంఏ సభ్యుల నిరసన
దురుసు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని ఐఎంఏ సభ్యుల నిరసన

By

Published : Jul 29, 2020, 5:42 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైద్యుల పట్ల ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ హిందూపురంలో ఇండియన్ మెడికల్ అసోషియేషన్ సభ్యులు నిరసన చేపట్టారు. పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులను మూసివేసి స్థానిక తహసీల్దారుకు వినతిపత్రాన్ని ఇచ్చారు. వైద్యుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుంటే దేశవ్యాప్తంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details