అనంతపురంలో కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ కార్యకర్త అస్వస్థతకు గురైంది. అనంతపురం జిల్లా రాణినగర్లో ఉంటున్న శకుంతల అనే అంగన్వాడీ కార్యకర్త శుక్రవారం మధ్యాహ్నం కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు ఫిట్స్ వణుకుడు లక్షణాలు కనిపించడంతో అన్ని రకాల పరీక్షలు నిర్వహించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని.. రెండు మూడు రోజులు పర్యవేక్షణలో ఉంచాలని చెప్పారు.
కొవిడ్ టీకా తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తకు అస్వస్థత - ananthapuram hospital latest news
కొవిడ్ టీకా తీసుకున్న ఓ అంగన్వాడీ కార్యకర్త అస్వస్థకు గురైంది. అనంతపురం జిల్లా రాణినగర్కు చెందిన శకుంతల శుక్రవారం కరోనా వాక్సిన్ తీసుకోగా రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అంగన్వాడీ కార్యకర్తకు అస్వస్థత