అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. గురుకుల పాఠశాలలో చరవాణి అదృశ్యమైన ఘటనలో అధ్యాపకులు వీరిని మందలించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఇద్దరు విద్యార్దులు అస్వస్థతకు గురవడం అనుమానాలకు తావు ఇస్తోంది. అధ్యాపకులు కొట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది కాక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పాఠశాల అధికార్లు విచారణ చేస్తున్నారు.
గురుకుల విద్యార్థుల అస్వస్థతపై అనుమానాలు - anantapur
సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై, ఆసుపత్రిపాలైయ్యారు. అనంతపురం జిల్లా కదిరిలో ఈ ఘటనపై విద్యార్దుల బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులకు అస్వస్థత