అనంతపురం జిల్లాలో కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న ముగ్గురు యువకులు హల్చల్ సృష్టించారు. బళ్లారికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై మద్యం తరలిస్తున్నట్లు విడపనకల్లు మండలం పాల్తూరు పోలీసులకు సమాచారం అందింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. యువకులు తప్పించుకున్నారు. గుంతకల్లు వైపు వెళ్తుండగా విషయం తెలుసుకున్న ఉరవకొండ ఎస్ఐ సిబ్బందితో కలిసి వెంబడించారు. పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించిన యువకులు తమ వద్ద ఉన్న మద్యం సంచులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో పడేసి వెళ్లిపోయారు.
మద్యం తరలిస్తూ యువకులు హల్చల్.. కానిస్టేబుల్కు గాయాలు - news on illigal alcohol to ananthapur
కర్ణాటక నుంచి అనంతపురానికి మద్యం తరలిస్తున్న ముగ్గురు యువకులను పట్టుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో వజ్రకరూరు పీఎస్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి.
వజ్రకరూరు పోలీసులకు సమాచారం అందగా వారు తమ వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి యువకులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రాజుకు గాయాలయ్యాయి. యువకులు కొంత దూరం వెళ్లగానే ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోయింది. ఇద్దరు తప్పించుకోగా..ఒకరిని వజ్రకరూరు పోలీసులు పట్టుకుని ఉరవకొండ పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడిని విచారిస్తున్నట్లు ఎస్సై ధరణిబాబు తెలిపారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: మాస్క్ పెట్టుకోమన్నందుకు ఉద్యోగినిపై అధికారి చాక్, కర్రతో దాడి
TAGGED:
అనంతపురంలో అక్రమ మద్యం