ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జల్సాలకు అలవాటు పడి... దొంగతనాలు, అక్రమంగా మద్యం విక్రయాలు!

అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అనంతపురం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 15 టెట్రా ప్యాకెట్లతో పాటు.. ఒక డమ్మీ పిస్టోల్, 7 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురంలో దొంగ అరెస్టు
అనంతపురంలో దొంగ అరెస్టు

By

Published : Jul 6, 2021, 9:51 PM IST

అనంతపురం శివారు జాకీర్ కొట్టాల కాలనీకి చెందిన మహమ్మద్ గౌస్ అలియాస్ చోటు అనే వ్యక్తి... అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ.జాకీర్ హుస్సేన్ తన సిబ్బందితో కలిసి నగరంలోని విద్యుత్​నగర్ సర్కిల్​లో మహమ్మద్ గౌస్​ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

వ్యసనాలతో జల్సాలకు అలవాటుపడిన మహమ్మద్ గౌస్... డమ్మీ పిస్టోల్​తో హైవేలపై వెళ్లే వాహనాలను ఆపి, బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని.. అంతే కాకుండా తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలు చేసి, బంగారు నగలు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. మహమ్మద్ గౌస్​ను అరెస్టు చేయడంతో పాటు అతని వద్ద ఉన్న ఉన్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసం చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ జాకీర్ హుస్సేన్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details